Wednesday, April 29, 2026
E-PAPER
Homeఆటలుక్వార్టర్స్‌లో సినర్‌

క్వార్టర్స్‌లో సినర్‌

- Advertisement -

మిర్రా అండ్రీవ ముందంజ
మాడ్రిడ్‌ ఓపెన్‌ 2026

మాడ్రిడ్‌ (స్పెయిన్‌) : వరల్డ్‌ నం.1 జానిక్‌ సినర్‌ (ఇటలీ) మాడ్రిడ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది ఏటీపీ మాస్టర్స్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జానిక్‌ సినర్‌.. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో 6-2, 7-5తో కామెరూన్‌ నోరీ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. 8 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లు సాధించిన జానిక్‌ సినర్‌.. కామెరూన్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గినా.. రెండో సెట్లో కామెరూన్‌ ప్రతిఘటించాడు. సినర్‌ సర్వ్‌ను ఓ సారి బ్రేక్‌ చేసి సవాల్‌ విసిరాడు. పాయింట్ల పరంగా 64-50తో జానిక్‌ సినర్‌ స్పష్టమైన పైచేయి సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఫ్రాన్స్‌ ఆటగాడు, 21వ సీడ్‌ ఆర్థర్‌ ఫిల్స్‌ సైతం క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అర్జెంటీనా ఆటగాడు టోమస్‌ మార్టిన్‌పై 6-3, 6-4తో ఆర్థర్‌ అలవోక విజయం సాధించాడు. 2 ఏస్‌లు, 2 బ్రేక్‌ పాయింట్లతో ఫ్రెంచ్‌ ఆటగాడు రాణించాడు. మహిళల సింగిల్స్‌లో మిర్రా అండ్రీవ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 7-6(7-1), 6-3తో లేలా ఫెర్నాండేజ్‌పై అండ్రీవ వరుస సెట్లలో గెలుపొందింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో సాధించినా.. రెండో సెట్లో దీటుగా బదులిచ్చి పైచేయి సాధించింది. టాప్‌ సీడ్‌ అరినా సబలెంక 6-7(1-7), 6-3, 6-2తో నవొమి ఒసాకపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకోగా.. మూడో సీడ్‌ కొకొ గాఫ్‌ 4-6, 6-1, 6-7(5-7)తో పరాజయం పాలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -