నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్తాన్ లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో నలుగురు మగ బిడ్డలు ఉన్నారు. మిగతా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ కాన్పులో తల్లీతోపాటు ఆరుగురు పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.