వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదు: కేటీఆర్

– అచ్చంపేట రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
నవతెలంగాణ – అచ్చంపేట 
వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదనీ అచ్చంపేట రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం ఇవ్వకున్నా హామీలన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడనీ అన్నారు. పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలనీ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్నారనీ అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఇప్పటికీ దిక్కులేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా ….రేవంత్ రెడ్డి తారీకు మారుస్తాడనీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు కాలేదు, రైతుబంధు అమలు కావడం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండడు… బీజేపీలోకి మారుతాడనీ,  ప్రవీణ్ కుమార్ ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి గౌరవం పెరుగుతుందనీ, అభివృద్ధిలో ముందుంటుందన్నారు. గురుకులాల కార్యదర్శిగా లక్షలాదిమంది విద్యార్థులకు సేవ చేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అచ్చంపేట ప్రాంతంలో చదువుకున్న వ్యక్తికి, అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడే పాలన బాగుండేదనీ ప్రజలు ఆశీర్వదించి 10-12 స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. ఆరు నెలల్లోనే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడనీ ఉన్నారు. మోడీ పాలలో దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదు బీజేపీకి మత విద్వేషం తప్ప, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. మతం పేరుతో విషం చిమ్ముతున్న భాజపాకు ఓటు వేయొద్దు ప్రజలకు సూచించారు.  నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు పార్టీకి వెన్నుపోటు పొడిచి, భాజపాలో చేరారు. బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ఎంపీ రాములు పార్టీ వీడారో అచ్చంపేట ప్రజలకు సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రిజర్వేషన్లు కోల్పోతారు.  రిజర్వేషన్లు రద్దు చేస్తానన్న  మోడీని ఓడించాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ తదితరులు ఉన్నారు.

Spread the love