ఆరో రోజుకి చేరిన పరీక్షలు..

– మూడు కేంద్రాల పరిధిలో 34 మంది గైర్హాజర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మంగళవారం కు ఆరో రోజు కు చేరాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం జూనియర్,టి.ఎం.ఆర్,వీకేడీవీఎస్ ఆర్ జూనియర్ కళాశాలల్లో నీ మూడు పరీక్షా కేంద్రాల పరిధిలో ద్వితీయ సంవత్సరం గణితం/వృక్షశాస్త్రం/రాజకీయ శాస్త్రం పరీక్షల లో మొత్తం 911 మంది విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి ఉండగా,877 మంది విధ్యార్ధులు పరీక్షలకు హాజరు అయ్యారు.34 మంది విద్యార్ధులు గైర్హాజరు అయ్యారు.తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,సీఐ జితేందర్,ఎస్.హెచ్.ఒ ఎస్ఐ లు శ్రీను,శివరామక్రిష్ణ లు బందోబస్తు ను పర్యవేక్షించారు. ఈ పరీక్షా కేంద్రాలకు చీప్ సూపరింటెండెంట్,డిపార్ట్మెంట్ ఆఫీసర్ లుగా దామెర నరసింహారావు,అలవాల వెంకటేశ్వరరావు,రామయ్య,ఝాన్సీ,యేశోబు,ఎల్.శివప్రసాద్ లు విధులు నిర్వహిస్తున్నారు.
కేంద్రం                       ఎలాట్మెంట్     ఆబ్సెంట్    ప్రజెంట్ 
జి.జేసి                       410             25          385
టిఎం ఆర్ జేసీ            193              05          188
వీకేడీవీఎస్ఆర్ జేసీ       308             04           304
మొత్తం                    911              34            877
Spread the love