విద్యకు స్వల్పంగా పెరిగిన ప్రాధాన్యత

విద్యకు స్వల్పంగా పెరిగిన ప్రాధాన్యత– కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా 15 శాతం కేటాయించాలి : టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం 2024-25కు ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో విద్యారంగానికి గతం కంటే స్వల్పంగా పెరగడాన్ని టీఎస్‌ యూటీఎఫ్‌ ఆహ్వానించింది. రూ. 2,75,891 కోట్ల బడ్జెట్‌లో విద్యకు రూ.21,389 (7.75 శాతం) కోట్లు కేటాయించిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది 6.7 శాతం కంటే ఈసారి కేటాయింపులు పెరిగాయని పేర్కొన్నారు. కేటాయిం పులు పెరిగినా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో లో ప్రకటించినట్టుగా 15 శాతం నిధు లను కేటాయించలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ నిర్వహిస్తామనీ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ తరగతి గదుల ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ముదావహమని తెలి పారు. ప్రతి మండలంలో అత్యాధుని క సౌకర్యాలు, ప్రమాణాలతో తెలం గాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు ప్రతిపాదించారని పేర్కొ న్నారు. వాటిని మండలానికి ఒకటి కాకుండా జనాభా ప్రాతిపదికన అవసరమైనచోట అద నంగా ఏర్పాటు చేయాలని సూచించా రు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే పబ్లిక్‌ స్కూళ్లుగా మార్చి అభివృద్ధి చేయాలని కోరారు. సీపీఎస్‌ ను రద్దు చేయాలనీ, పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలనీ, మూడు డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్‌పే అమలు గురించి బడ్జెట్‌లో ప్రస్తావిం చకపోవడం విచారకరమని తెలిపారు.
విద్యకు ప్రాధాన్యతనివ్వలేదు : టీపీటీఎఫ్‌
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వలేదని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌ తెలిపారు. 7.75 శాతం నిధులు కేటాయించినా, గతేడాది కంటే కొంత మెరుగైనా నామమాత్రమే నని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మ్యాని ఫెస్టోలో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అందులో సగం నిధులు కేటాయించారని తెలిపారు. 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతు లు, మరుగుదొడ్ల నిర్వహణ గురించి ప్రస్తావన లేకుండా తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించడం శోచనీయమని విమర్శి ంచారు. విశ్వవిద్యాలయాలు రూ. మూడు వేల కోట్లు కోరితే రూ.500 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని సూచించారు.
విద్యకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం : టీఆర్టీఎఫ్‌
ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 7.75 శాతం నిధులతో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్టీ ఎఫ్‌ అధ్యక్షులు కటకం రమేష్‌, ప్రధాన కార్యదర్శి కావలి అశోక్‌కుమార్‌ స్వాగ తించారు. కేటాయింపుల మేరకు ఖర్చు చేయాలని సూచించారు. గురు కుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించ డం శుభపరిణామమని తెలిపారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పూర్తిస్థాయి బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు పెంచాలని సూచిం చారు. ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏ అంశాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వాటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు హర్షణీయం : టీఎస్‌సీపీఎస్‌ఈయూ
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.21,389 (7.75 శాతం) కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమని టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఉపాధ్యక్షులు మ్యాన పవన్‌ తెలిపారు. ప్రతిమండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయిం చడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొ న్నారు. 65 ఐటీఐలను ఆధునీకరిచ డంతోపాటు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలనీ, పీఆర్సీని అమలు చేయాలని కోరారు.
విద్యాభివృద్ధికి భరోసా ఇచ్చిన బడ్జెట్‌ : టీఎస్‌పీటీఏ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ విద్యాభివృద్ధికి భరోసా ఇచ్చిందని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య తెలిపారు. పదేండ్లుగా విద్యారంగం నిరాదరణకు గురైందని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదికొక ఉపాధ్యాయుడు ఉండాలనీ, ప్రాథమిక విద్యకు ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలనీ, స్కావెంజర్లను నియమిం చాలని సూచించారు.

Spread the love