తునికాకు కూలికి పాముకాటు

– పట్టించుకోని అటవీశాఖ
– ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలి
– తుడుం దెబ్బ జిల్లా కార్యనిర్వాణా అధ్యక్షులు ఎట్టి ప్రకాష్
నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన ఎట్టి కళ్యాణ్ అనే ఆదివాసీ కూలి సోమవారం తునికాకు కోస్తున్న క్రమంలో  కూలీ పాముకాటుకు గురైనాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫస్ట్ ఎయిడ్ చేసి తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎట్టి కల్యాణ్ అనే ఆదివాసీకి చికిత్స పొందుతున్నాడు.
ఇప్పటివరకు పట్టించుకోని అటవీశాఖ: ఐదు లక్షలు ఎక్కువ చెల్లించాలి
పాము కాటుకు గురై తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పొందుతున్న ఎత్తి కళ్యాణ్ అనే ఆదివాసి యువకునికి 24 గంటలు కావస్తున్నా ఇప్పటివరకు ఫారెస్ట్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని తుడుందెబ్బ ములుగు జిల్లా కార్యనిర్వాన అద్యక్షుడు ఎట్టి ప్రకాష్ ఆవేదన చెందారు. పాముకాటుకురైన ఆదివాసి బిడ్డ పేదవారని అతనికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం ఆదుకోవాలని, అతనికి ఐదు లక్షల ఎక్స్గ్ రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
Spread the love