నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవనంలో రెండు రోజుల పాటు జరిగాయి. 2026 – 27 సంవత్సరానికిగాను డీటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతినిధులు ఆదివారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా టి లింగారెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వి రాజిరెడ్డి, టి శ్రీశైలం, చాపబాబు, పి సృజన, పి దాసు, రాష్ట్ర కార్యదర్శులుగా ఎం సామ్యూల్, జె రామస్వామి, ఎ శ్రీనివాసరెడ్డి, బి శ్యామ్, ఆర్ లింగయ్య, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు ఎం గంగాధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా బి సదానందం, సభ్యులుగా బి జాన్ నాయక్, బివి ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు.
డీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సోమయ్య, లింగారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



