చౌట్ పల్లిలో ప్రత్యేక ఇంటిపన్ను వసూలు కార్యక్రమం

– ఒక్కరోజే రూ. లక్ష  50వేల 149 వసూలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం ప్రత్యేక ఇంటి పన్ను వసూలు కార్యక్రమాన్ని  నిర్వహించారు. ప్రత్యేక ఇంటి పన్ను  వసూలు బృందం సభ్యులు  గ్రామంలో పర్యటించి పేరుకుపోయిన పాత పన్నులు, ఇంటి బకాయిలు వసూలు చేశారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల తహసిల్దార్ ఎం. ఆంజనేయులు  ప్రత్యేక ఇంటి పన్ను వసూలు బృందం సభ్యులతో కలిసి ప్రత్యేక డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రోజు గ్రామంలో రూ. లక్ష  50వేల 149 వసూలు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ తమ తమ  ఇండ్లకు సంబంధించిన పాత బకాయిలను, ఇంటి పన్నులను చెల్లించడం ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ప్రజలు ఇంటి పన్నులను సకాలంలో చెల్లిస్తేనే గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంటి పన్నులు చెల్లించడం ద్వారా  ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, స్థానిక పంచాయతీ కార్యదర్శి గంగా జమున, మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కారోబర్లు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love