
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం లో ని అనాజీపురం గ్రామంలో ఓలేశ్వరం స్వయంభూ శ్రీలక్ష్మి నరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని గురువారం గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి జిల్లాలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రులు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఓలేశ్వరం స్వయంభూ శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు,ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి సిరికొండ అశోక్, పిట్టల శ్రీశైలం, ఎదునూరి నరేష్ ఆలయ కమిటీ సభ్యలు గోద మల్లయ్య, అందే సత్యనారాయణ, గ్రామస్తులు మిరియాల కిష్టయ్య, రాచమల్ల విజయ్ కుమార్, కృష్ణ లు పాల్గొన్నారు.