వివాహిత అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు

నవతెలంగాణ -భిక్కనూర్
వివాహిత అదృష్టమైన సంఘటన మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం బస్వాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ (23) గ్యాస్ బుక్ పని నిమిత్తం సోమవారం తన అత్తగారి ఇంటి వద్ద నుండి బస్వాపూర్ గ్రామానికి వచ్చి తిరిగి కామారెడ్డి వెళ్ళింది. రాత్రి వరకు అత్తగారి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబీకులు బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.

Spread the love