
మండల కేంద్రంలోని శ్రీ భాషిత జూనియర్ కళాశాలలో బుధవారం వెల్కమ్ పార్టీ హంగామా కొనసాగింది. స్థానిక పద్మశాలి విజయ సంఘం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమం ఫుల్ జోష్ తో సాగింది. ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొదటి సంవత్సర విద్యార్థులకు కళాశాలలోకి వెల్కమ్ చెబుతూ.. ఈ పార్టీని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాల కోసం కష్టపడి చదవాలన్నారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించడం ద్వారా చదివిన కళాశాలతో పాటు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సంకేట రవి, సిలివెరి సంజీవ్, మలావత్ సంతోష్, లెక్చరర్లు హన్మాండ్లు, సుమన్, సాయన్న, గంగారం, గజానంద్, శ్రీధర్, రాజేష్, శృతి, తదితరులు పాల్గొన్నారు.