
నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు రెండవ రోజు సోమవారం కూడా ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్ పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో కర్మణ పున్యహవచనం,స్థాపిత దేవతా హోమములు, యంత్రన్యాసములు,ధాన్యధివాసము కార్యక్రమాలు నిర్వహించారు. జలాదివాసములో ఉంచిన దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. .పెద్దయెత్తున తరలివచ్చిన భక్తులు హోమగుండాల చుట్టూ తిరిగి పూజలు చేశారు.వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం గౌరవాద్యక్షులు దీకొండ యాదగిరి,వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య ,నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట్ నర్సయ్య,దాసరి గుండయ్య,కైరంకొండ విఠల్,బింగి మోహన్,మందిర కమిటీ చైర్మెన్ దేవదాస్,రాపెల్లి గురుచరణ్,గుడ్ల భూమేశ్వర్,బల్ల లక్ష్మిబాయి, సిలివేరి శంకర్,చింతల గంగాదాస్,బూస శ్రీనివాస్,,జె.సత్యపాల్,తుమ్మ నాగభూషణం,అంకం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.