“నాసా”లో జయభేరి మోగించిన శ్రీ చైతన్య

శ్రీ చైతన్య విద్యార్థులు
శ్రీ చైతన్య విద్యార్థులు

నవతెలంగాణ హైదరాబాద్: రామంతపూర్ శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం రోజు “నాసా” లో ఎనలేని ప్రతిభను చూపిన విద్యార్థులకు “నాసా” పంపు కార్యక్రమానికి పాఠశాల ఏజిఎం. సతీష్ విచ్చేసి, విద్యార్థులను అభినందిస్తూ “చదువుతో పాటు- ఇలాంటి కార్య క్రమములను నిర్వహించడం వలన విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయవచ్చని సూచిస్తూ అభినందించారు. అలానే ముఖ్య అతిథిగా విచ్చేసిన “యారసి సౌజన్య” సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్టు- సియస్ ఐర్. ఐఐసిటి మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా విద్యార్థులను ప్రోత్స. హించాలని సూచిస్తూ, కిట్ల పంపణీ చేసారు. పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను గుర్తించి, ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని సెలవిచ్చారు. ఇందులో భాగంగా ఆర్.వి. మల్లి ఖార్జున నాయుడు, జోనల్ -ఆర్డినేటర్స్ రాజేంద్రప్రసాద్, పుల్లారావు, డీన్ నాగారాజు ఐకాన్’ సి ‘బ్యాచ్ ఇంచార్జెస్ కనకయ్య, వీరాంజనేయులు, నాసా ఇంచార్జ్ అరుణ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు న్నారు.

Spread the love