Friday, September 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ మండలంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

కుభీర్ మండలంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్: కుభీర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రమైన కుభీర్‌తో పాటు పార్డి (బి), పల్సి, సోనారి, మలేగాం తదితర గ్రామాల్లో కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వాహకులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని బట్టి గల్లీలో శ్రీ కృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉట్టి కొట్టే’ కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనల్లో చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో అలరించాయి. వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండలవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలతో గ్రామాల్లో భక్తిసందడి నెలకొంది.ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -