కోనేటి పురం కొండపై వెలసిన శ్రీ తిరుమల నాథ స్వామి

– ఘనంగా తిరుమల నాథుని కళ్యాణం
నవతెలంగాణ -పెద్దవూర
ఈ ఆలయానికి ఒక విశేషం ఏంటంటే ఒకసారి వెంకన్న స్వామిని దర్శించినవారు తప్పకుండ మళ్ళీ పదే పదే వెళ్తారని చెబుతుంటారు. అయితే కలియుగ భగవానుడు శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల నాథ స్వామి గా ఇక్కడ ఎలా వెలిసాడు? ఈ ఆలయానికి గల స్తలపురాణం ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర, తిరుమల గిరి సాగర్ మండలాల సరిహద్దు లోని కుంకుడు చెట్టు తండ మరియు కోనేటి పురం లోని తిరుమలయ్య గట్టుమీద వెలసిన తిరుమల నాథ స్వామి పెద్దవూర నుంచి10 మీటర్లదూరంలో నాగార్జున సాగర్, హాలియా ప్రధాన రహదారి ప్రక్కన కుంకుడు చెట్టు తండా సమీపంలోని కోనేటి పురం శివారులో కొలువైవున్నారు.ఈ గ్రామం నందు పురాతన విష్ణు క్షేత్రంగా పిలవబడే శ్రీ తిరుమల నాథ స్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.శనివారం తిరుమల నాథుని కళ్యాణం మహా ఘనంగా నిర్వహించారు.
ఆలయ స్థల పురాణం
ఈ ఆయ స్థల పురాణానికి వస్తే, ద్వాపరయుగంలో కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో మోక్షం కోరి ఇద్దరు మునులు కోనేటి పురం లోని గట్టు ప్రాంతం సేదతీరుటకు గాను చెట్టుకింద కూర్చున్నారు. నలుగు దొంగలు అక్కడ కూర్చున్న మునులవద్దకు వెళ్లి వరివద్ద వున్న కమండలం, రుద్రాక్షలు, కొంత పైకం తీసుకొని కొద్దిదూరం వెళ్లాక ఆ దొంగలకు కళ్ళు కనిపించక దారితెలవక అర్థనాదాలు చేశారు. తప్పును తెలుసుకుని వారు దోచిన వస్తువులు తిరిగి ఇచ్చి వెళ్లారు. ఆమునులుఅక్కడి నుంచి వెళ్ళిపోతుండగా కూర్చున్న చెట్టు కిందికి వంగి వారికీ అడ్డుగా మారింది. విష్ణు మూర్తిని ప్రసన్నం చేసుకోగా వారికీ దారి కనిపించింది. ఈరెండు సంఘటనల తో అక్కడ విష్ణుమూర్తి వెలిసినట్లు కథనం.మరో కథనం ప్రకారం గరుడాద్రి అనే పర్వత రాజు మునులు చేసిన తపస్సుకి మెచ్చి స్వామివారు ఇక్కడ వెలిశారు.పర్వతరాజు ఒక రోజు రాత్రి విశ్రాంతి నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తానని,చెప్పడం తో ఉపమాక పేరుతో పూజలు తపస్సు, దాన, పుణ్యదిక కర్మలు ఫలప్రదాయం వంటివి ఆచరించారు. అక్కడికి వచ్చి వారికీ వెళ్లినట్లు స్థలపురాణం చెబుతుంది.అప్పటినుంచి ఈ కోనేటి పురం ఎంతో పవిత్రమైనదని తిరుమలలోని పాపనాశంతో తిరుమల నాథ స్వామి సమానమని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ఛైర్మెన్ బుర్రి రాంరెడ్డి తెలిపారు.

Spread the love