ఫలించిన శ్రీదర్ బాబు వ్యూహం

– ప్రత్యర్థి, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని విజయం
– మంథనిలో మరోసారి పాగా వేసిన కాంగ్రెస్
నవ తెలంగాణ-మల్హర్ రావు
విలక్షణ తీర్పు ఇచ్చే ఆనవాయితీ ఉన్న మంథని ప్రజల నాడిని అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణ మేనిమేస్టో చైర్మన్, కాంగ్రెస్ అభ్యర్ధి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పసిగట్టారు. ఆయన రచించిన వ్యూహం పలించడంతో ఐదోవసారి విజయం సొంతం చేసుకున్నారు. మొదట ప్రచారంలో మాములుగా చేపట్టి చివరి.రోజుల్లో తనదైన శైలిలో ముందుకు సాగడంతో గెలుపు సొంతమైంది. మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న అసమ్మతిని గుర్తించి ఆపార్టీకి చెందిన అనేకమంది ప్రజాప్రతినిధులు, నాయకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతోపాటు మరోచోట బుంగపడటాన్ని తనకు అనుకూలంగా మల్చుకున్నారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల మూడేళ్ళుగా గోదావరి, మానేరు తీర రైతుల్లో వ్యతిరేకతను గుర్తించారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని రెండుసార్లు నియోజవర్గానికి రప్పించడం లాంబించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైన ఉమ్మడి కమాన్ పూర్ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని భావించి కమాన్ పూర్, రామగిరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో బీఆర్ఎస్ నాయకుల అంచనాలు తలకిందులు చేస్తూ రామగిరి నుంచి 5,103, మంథని మండలం నుంచి 4,700 ఓట్ల మెజార్టీ సాధించారు. తూర్పు మండలాలైన మహాముత్తారం, మహాదేవ్ పూర్, కాటారం, మల్హర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ లో చేర్చుకొని పట్టు సాధించారు. కాటారం నుంచి 7 వేలు, మహాదేవ్ పూర్ నుంచి 2వేలు, మల్హర్ నుంచి 3వేలు, మహాముత్తారం నుంచి 1500పైచిలుకు మెజార్టీ రాబట్టుకున్నారు. ఒక్క పలిమేల మండలంలో కొద్దిపాటి తేడా తప్ప అన్ని మండలాల నుంచి మెజార్టీ సాధించి శ్రీదర్ బాబు 31 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఆయన స్థానికంగా ఉండడం లేదని ప్రత్యర్థి చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. గతంలో నాలుగుసార్లు ఇక్కడి నుంచి గెలిచానని తనవద్ద ప్రజలు ఏనాడు ఆవిషయాన్ని ప్రస్తావించలేదని ఎక్కడున్నా వారి అభివృద్ధి, సంక్షేమం కోసమే పని చేశానని ప్రచారం చేశారు. మల్హర్ మండలంలోని తాడిచెర్ల, మల్లారం గ్రామాలు ఆనవాయితీగా నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్ పార్టీలకు కంచుకోటలా ఉన్నవాటిని సైతం బీటలు కొట్టి తాడిచెర్ల 667, మల్లారంలో 202 ఓట్లను రాబట్టడం మరో విశేషం.
Spread the love