విజ్ఞాన వెలుగుల్ని నింపిన శ్రీనివాస్ రావు..

– తిర్మన్ పల్లి పాఠశాలలో ఘనంగా అధ్యాపకులకు సన్మానం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
విజ్ఞాన వెలుగుల్ని ప్రతి విద్యార్థి లో నింపిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు అని,అయన చేసిన సేవలను గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనరని ఎంపిటిసి చింతల దాస్ అన్నారు.మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామం లోని ప్రాథమిక, ఉర్దూ అప్పర్ ప్రైమరీ పాఠశాల, గంగారాం తండా లోని ప్రాథమిక పాఠశాల కు చెందిన అధ్యాపకులను, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపైకైన శ్రీనివాస్ రావు,మండల ఉత్తమ ఉపాధ్యాయులు ఉమారాణి,కరణం రాజు లను ఎంపిటిసి, గ్రామ అభివృద్ది కమిటీ,ఎస్ ఎంసి లో అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ తిర్మన్ పల్లి పాఠశాల పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా శ్రీనివాస్ రావు తోపాటు అధ్యాపక బృందం ప్రత్యేక కృషి చేయడం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గ్రామం పేరు తేవడానికి కృషి చేయడం హర్షించదగ్గ విషయ మన్నారు. విద్యార్థులు అధ్యాపకులు బోధించే వాటిని శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం అధ్యాపకులు నిరంతరం సంప్రదిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నారని, పాఠశాల అభివృద్ధికి గ్రామ అభివృద్ది కమిటీ, యువకులు, గ్రామ పంచాయతీ, ఎంపిటిసి,ఎస్ ఎంసి కృషి మరువలేనిదని పేర్కొన్నారు.అంతకు ముందు సర్వే పల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమం లో గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ గోపు గోవర్దన్, ఉపాధ్యక్షులు మదం వెంకటీ, కిషన్,తెడ్డు మహేందర్, మహేష్, లింగన్న,గాండ్ల గంగాధర్, కొమురయ్య,పుట్నల శ్రీనివాస్, శివారం, సాయిలు, రమేష్, శ్రీను, గంగేశ్వర్, పాఠశాల చైర్మన్ ఇమ్మడి సాయిలు తో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love