ఉపాధ్యాయ వృత్తికే పేరు తెచ్చిన వ్యక్తి శ్రీనివాసరావు

– యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జీవీ.నాగమల్లేశ్వరరావు
నవతెలంగాణ-కల్లూరు
ఉపాధ్యాయ వత్తి లోకంగా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసి ఉపాధ్యాయ వత్తికే పేరు తెచ్చిన వ్యక్తిగా మట్టపర్తి శ్రీనివాస్‌రావు సేవలు ఎనలేనివని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జీవీ.నాగమల్లేశ్వరరావు కొనియాడారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడుగా పనిచేసి మంగళవారం పదవి విరమణ చేసిన మట్టపర్తి శ్రీనివాసరావును ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూటీఎఫ్‌ సంఘ బాధ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్తిపాటి నివేదిత అధ్యక్షతవహించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్‌ విజ్ఞానం పెరుగుతున్నప్పటికీ ప్రజల్లో మూఢనమ్మకాలు పోలేదని వాటిని ఆసరా చేసుకుని నేటి రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. శ్రీనివాసరావు యూటీఎఫ్‌లో పలు బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా రాణించారన్నారని ఆయన సేవలను కొనియాడారు. శ్రీనివాసరావు సేవలు పలువురికి ఆదర్శంగా నిలిచాయని ఎంఈఓ దామోదర్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సతీష్‌, కే.విజరుకుమార్‌, రాయల్‌ నాగేశ్వరరావు, వీ.శ్రీనివాస్‌, పాఠశాల ఉపాధ్యాయులు బంధువులు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Spread the love