రైతుల పక్షపాతి శ్రీపాదరావు కుటుంబం

– కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు వైనాల రాజు
నవతెలంగాణ – రామగిరి: రైతుల పక్షపాతి దుద్దిళ్ళ కుటుంబమని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో వైనాల రాజు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైనాల రాజు మాట్లాడుతూ… మంథని నియోజక వర్గ రైతాంగానికి సాగు నీరు అందకపోవడానికి కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీ అని, కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజక వర్గంలోని ఒక్క ఎకరమైనా పారిందా అని, రైతన్నలకు నీరు అందించిన ఘనత శ్రీధర్ బాబుదే అని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి గుండారం రిజర్వాయర్ లో 2 టిఎంసిల నీరు నింపి వేలాది ఎకరాల సాగు నీటిని మంథని నియోజక వర్గానికి అందించిన ఘనత శ్రీధర్ బాబుకి దక్కిందని, రైతుల ఆనందమే తమ ఆనందంగా స్వీకరించి శ్రీధర్ బాబు రైతులకు అహర్నిశలు కృషి చేశారని అన్నారు.
ఎన్నికలకు స్టంట్ కోసం బీఆర్ఎస్ నాయకు లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రైతన్నల కోసం మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు వుందని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్లు అవినీతి చేసింది బిఆర్ఎస్ నాయకులు కాదా అని అన్నారు. ఈ సమావేశంలో మండల అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్, బోస తిరుపతి, జంగిలి కొమురయ్య, కొంకం శ్రీనివాస్, అర్కటి అంజన్న, కటికిరెడ్డి తిరుపతిరెడ్డి, బొజ్జ సతీష్, మామిడి రాజు పాల్గొన్నారు.

Spread the love