టూరిజం కార్పొరేషన్ లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిమాయత్ నగర్ లోని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ గౌరవ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టూరిజం శాఖ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ అని  స్వరాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు వస్తుందనే ఆలోచనలోంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమని తెలిపారు. స్వరాష్ట్రంలో 9ఏండ్లు పూర్తి చేసుకొని దిగ్విజయంగా 10వ ఏడాదిలోకి అడుగుపెడుతున సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ 9 ఏండ్ల కాలంలో తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.  సమైక్య పాలనలో నీళ్ళు లేక వ్యవసాయం దండుగా అనుకున్న తెలంగాణను కాళేశ్వరంతో పచ్చగా కేసీఆర్ మార్చారని గుర్తుచేశారు.  ఇవాళ తెలంగాణ దేశానికి అన్నం పెట్టేలా ‘seed bowl of Telangana` గా మార్చిన ఘనత మన కేసీఆర్ దే అని ఆయన తెలిపారు.  సమైక్య పాలనలో టూరిజానికి ఏనాడు గుర్తింపు రాలేదన్న ఆయన తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక ప్రపంచ దేశాల పర్యాటకులు తెలంగాణకు వచ్చేలా ముఖ్మమంత్రి అభివృద్ధి చేశారని తెలిపారు.  కేసీఆర్ ప్రత్యేక దృష్టి వల్లే తెలంగాణ టూరిజం దేశంలో నెంబర్ 1 గా నిలిచి అందరిని ఆకర్షిస్తుందని అన్నారు. ముఖ్మమంత్రి ఆలోచనకు నిదర్శనమే రామప్పకి వచ్చిన యునెస్కో అవార్డ్..  తెలంగాణ టూరిజం ప్రపంచ దేశాలతో పోటీపడేలా సిబ్బంది కష్టపడాలని కోరారు. బంగారు తెలంగాణ దిశగా అవిశ్రాంతంగా కష్టపడుతున్న సీఎం కేసీఆర్ కు మనందరం అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, టూరిజం శాఖ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

Spread the love