లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాలు, ముడి చమురు ధరలు దిగిరావడం వంటి సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 340 పాయింట్లు లాభపడి 73,428 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 22,252 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద ప్రారంభమైంది.

Spread the love