ఈదురు గాలులు.. వర్షం బీభత్సవం..

– కొనుగోలు కేంద్రాలలో తడిసిన వరి ధాన్యం..
– పలుచోట్లలో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు..
– ఈదురుగాలికి పడిపోయిన చలువ పందిళ్లు, ఇంటి పై కప్పు..
నవతెలంగాణ – వేములవాడ 
ఎండలు మండుతుండగా మంగళవారం మధ్యాహ్నం నుండి ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా కురిసింది, ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.  ఈదురుగాలులతో వర్షం పడడంతో వేములవాడ దేవాలయ పరిసర ప్రాంతాలలో చెరువును తలపిస్తున్న రాజన్న ఆలయ పరిసరాలు కురిసిన భారీ వర్షానికి రోడ్ల పై నీళ్ళు వరదలా పారుతున్నాయి.రాజన్న ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగి చెరువునుతలపిస్తున్నాయి,ఎక్కడిక్కడ నిలిచిపోయిన  వాహనాలు, రాజన్నలయ పార్కింగ్ స్థలంలో చలవ పందిర్లు పడిపోయాయి. వడగండ్లతో కురిసిన వర్షంతో బురదమయంగా మారిన ప్రధాని ప్రసంగించే సభాస్థలి, హెలిప్యాడ్ ప్రాంగణాలు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న వారి ధాన్యం మొత్తం వర్షానికి తడిసి ముద్దయ్యాయి, నీటి ప్రవాహంలో ధాన్యమంతా కొట్టుకుపోయింది. మునిసిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలోని 6వ వార్డ్ బొజ్జపల్లి చెందిన నిరుపేద కుటుంబం అయిన రేగుల శేఖర్ ఇంటి పైకప్పుఈదురుగాలికి  మొత్తం ఎగిరిపోయింది. వేములవాడ రూరల్ మండలంలోని మల్లారం, బొల్లారం గ్రామాలలో ఈదురుగాలితో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. ఈదురు గాలిలో నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Spread the love