చిన్నోడికి పెద్ద బాధ్యత..!

– విధుల పట్ల అలసత్వం – పర్యవేక్షణ నిల్..
– తల్లి ఉద్యోగం – కొడుకు విధులు..
– పట్టించుకోని ఆలయ ఈవో..
నవతెలంగాణ – వేములవాడ 
నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే రాజన్న క్షేత్రం.  ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో రాజన్న దేవాలయ ఉద్యోగులు ఉంటారు.. సుమారు 14  సంవత్సరాల వయసు ఉన్న  చిన్నోడికి పెద్ద బాధ్యత దేవాలయ ఏ అధికారులు ఇచ్చారో తెలియదు కానీ, ఈ చిన్నోడు దేవాలయంలోనీ బుకింగ్ కౌంటర్లో గండాదిపం టికెట్లు భక్తులకు ఇస్తూ నవ తెలంగాణ కెమెరాకు చిక్కాడు.. దేవాలయంలో విధి నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ ఏ రేంజ్ లో ఉందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.. రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఉద్యోగిని విధినిర్వహణలో ఉండకుండా ఆమె కొడుకును ముఖ్య బుకింగ్ కౌంటర్లు కూర్చుండబెట్టి టికెట్లను ఇచ్చే బాధ్యతను అప్పజెప్పింది. రికార్డ్ అసిస్టెంట్ ఈ ఉద్యోగిని పై గతంలో సైతం కేశఖండనం కౌంటర్లో అవకతవకలు జరిగాయని విమర్శలు ఈ ఉద్యోగిని పై ఆరోపణలు ఉన్నాయి. అందులోనుండి బదిలీ చేసి గండాదీపం టికెట్లు బుకింగ్ కౌంటర్లో విధులకు కేటాయించారు. ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు పర్యవేక్షణ నిల్.. ఆ బాలుడు టికెట్లు ఇచ్చే సమయంలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దేవాలయంలోని అధికారులను ఎంక్వైరీ అధికారిగా నియమించి చేతులు దులుపుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దేవాలయ అధికారుల, ఉద్యోగుల అవినీతి , విధుల పట్ల అలసత్వం పై విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో లోపాలను అక్రమాలు, ఆలయ ఖజానాకు నష్టం బాధ్యులైన అధికారుల ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ,కు ప్రభుత్వానికి నివేదికను అందించారు.  ఈవో   కూడా సరిగా సమయం కేటాయించడం లేదని ఆరోపణలు ఉన్నాయి, దేవాలయ ఉద్యోగులు విధుల  పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఆలయ పర్యవేక్షణ వ్యవహారంలో ఆలయ ఈవో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చాలానే ఉన్నాయి. ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కమిషనర్ దేవాలయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Spread the love