పాఠశాలలను బలోపేతం చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు

– జూన్ 12 కల్లా అన్ని పాఠశాలల్లో మరమ్మత్తుల పనులు చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

– మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలను బలోపేతం చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారని, జూన్ 12 కల్లా అన్ని పాఠశాలలో మరమ్మత్తుల పనులు చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయలు కల్పించాలని మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ గురువారం అన్నారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులతో మహిళ గ్రామ సంఘాల అధ్యక్షులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని ఎంపీడీవో సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలల్లో గుర్తించిన సమస్యలను పనులను ప్రారంభించిన వారికి 10 శాతం డబ్బులు అడ్వాన్సుగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. చేసే పనుల్లో నాణ్యత ఉండాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ సభ అధ్యక్షులు కలిసి పాఠశాలల్లో పనులను చేపట్టాలన్నారు. గ్రామ సంఘము ద్వారా పాఠశాలల్లో పనులను చేయించుకోవాలని హెచ్ఎం లకు సూచించారు. మహిళ విలేజ్ ఆర్గనైజేషన్ ఎవరి ద్వారా పనులు చేయించిన విలేజ్ ఆర్గనైజేషన్ వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని హెచ్ఎం లకు సూచించారు. పాఠశాలలో చేసి మనమత్తు పనులకు హెచ్ఎం మోనిటర్ ఇన్ చేసుకోవాలని అన్నారు. జూన్ 12 కల్లా పాఠశాలల్లో అన్ని పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం మరుగుదొడ్ల సౌకర్యం విద్యుత్ సౌకర్యం కాంపౌండ్ వాల్ సౌకర్యాలను కల్పించి విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్ కుమార్, ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఐ సురేంద్ర వర్మ, ఏటీఎం రవీందర్ రెడ్డి మండలంలోని అన్ని గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయులు, మండలంలోని అన్ని గ్రామాల గ్రామ మహిళ సంఘాల అధ్యక్షులు, ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్లు మండల సమైక్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love