కాక్రోచ్ జనతాపార్టీ పేరుతో యువత చేసిన పోరాటం నేర్పుతున్న పాఠం ఏమిటి?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం అయినట్టేనా?
ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు చేరాయా?
భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్యమాన్ని పక్కదారులు పట్టించగలరా?
ఇవన్నీ పరిశీలించలవలసిన అంశాలే. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత పోరాటానికి తొలి విజయం. యాదృచ్ఛిక స్పందన నుంచి మొదలై, సమరశీల పోరాటం వైపు సాగింది ఉద్యమం. వ్యక్తిగత స్పందనగా మొదలై, దేశ ప్రజల గొంతుకగా వినిపించిన ప్రతిఘటన. ఆధునిక చదువులు చదివిన యువతీ యువకులు, విద్యార్థులు కదం తొక్కారు. శ్రామిక ప్రజానీకం, ప్రజాస్వామ్యవాదులు అండగా నిలిచారు. బాలబాలికల నుంచి వృద్ధుల వరకు మమేకమైన పోరాటమిది. జంతర్ మంతర్‌లో నిరసనలతో ప్రారంభమైన ఉద్యమం ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహారదీక్షతో ఊపందుకున్నది. నీట్ పరీక్షాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా 37 రోజుల పోరాటంతో మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. భవిష్యత్ పోరాటాలకు ఇది ఆరంభం మాత్రమేనని అభిజిత్‌దీప్కే ప్రకటించడం యువతను ఆలోచింపజేస్తున్నది. ఉద్యమం ఆరంభంలోనే “మోడీ పాలనలో హిందూ, ముస్లిం పంచాయితీ ఒక్క ఉద్యోగమైనా తెచ్చిందా?” అని దీప్కే ప్రశ్నించిన విషయం మరువరాదు. పాలకుల నుంచి యువత జవాబుదారీతనం కోరుకున్నది. మోడీ ఎవరికీ జవాబుదారుగా ఉండరు. తనను తాను రాజుగా భావిస్తారు. దానికి గుర్తుగానే పార్లమెంట్‌లో రాజదండం తెచ్చిపెట్టారు. మంత్రి కూడా ఆ బాటలోనే నడిచారు.
అందుకే యువత ఆగ్రహించింది. మంత్రి రాజీనామా కోరింది. 2002లో అల్లర్లతో గుజరాత్ మంటలు చెలరేగినా, నాడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయని నరేంద్రమోడీ నేటి యువత ప్రతిఘటనను ఖాతరు చేయలేదు. మెగసెసే అవార్డు గ్రహిత సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహారదీక్ష తప్పలేదు. పోలీసులు జంతర్ మంతర్ వీధుల్లో ఆరడుగుల ఎత్తులో బారికేడ్లు నిర్మించారు. ‘సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన మాకు జైలులోకి పోతున్నట్టే’ అనిపించింది. ఉన్నట్టుండి జూలై 17న ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాను హోంమంత్రి అమిత్‌షా అర్ధంతరంగా తొలగించారు. ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో ఉన్న సతీష్ గోల్చా అధికారయుత లాంఛనాలేవీ లేకుండానే తొలగవలసి వచ్చింది. ఆగమేఘాల మీద మరో ఐపీఎస్ అధికారి అనురాగ్‌కుమార్ కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రజలకు అసలు విషయం అర్థమైంది. దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడానికి సతీష్ గోల్చా నిరాకరించడమే ఈ మార్పునకు కారణమని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. అనురాగ్‌కుమార్ చేసిన మొదటి పని సోనమ్ వాంగ్‌చుక్‌ను నిర్బంధించడమే. మోడీ ప్రభుత్వం అంతటితో ఆగలేదు. నేషనల్ సెక్యూరిటీ చట్టం ప్రకారం కారణం చూపించకుండానే ఏడాదిపాటు జైలులో నిర్బంధించడానికి పోలీసులకు అసాధారణ అధికారాలిచ్చింది.
ఈ నేపథ్యంలోనే యువత ‘చలో పార్లమెంట్’కు సిద్ధపడ్డారు. ప్రజాప్రతినిధులంతా అందుబాటులో ఉండే సందర్భమది. అత్యున్నత చట్టసభల్లో చర్చకు అవకాశముంటుంది. పాలకులు నోరువిప్పక తప్పదు. అందుకే పార్లమెంట్ బాట పట్టారు. ప్రధాని మోడీ చేతిలో భారత రాజ్యాంగానికి బదులు రాజదండం ఉన్నది కదా! అందుకేనేమో అణచివేత ఊపందుకున్నది. ఇంటర్నెట్ సంబంధాలు రద్దుచేసారు. ఐదు మెట్రో స్టేషన్లు మూసివేసారు. మరో ఐదుగురు డిప్యూటీ పోలీస్ కమిషనర్లను బదిలీ చేసారు. అణచివేతలో సమర్ధులను తెచ్చిపెట్టుకున్నారు. అంతే… పోలీసులు విజృంభించడం మొదలైంది. విచక్షణారహితంగా లాఠీచార్జీ చేసారు. వరుసగా ఐదు రోజులు పార్లమెంట్ వీధులు యుద్ధరంగాన్ని తలపించాయి. వందలాది మంది యువతీ యువకులను చితకబాదారు. ఐదో రోజుకల్లా 18 మెట్రోస్టేషన్లు మూసి వేశారు. విద్యార్థులు, యువతీ యువకులు మెట్రో స్టేషన్లలోనే నిరసన గళం వినిపిం చవలసి వచ్చింది. పార్లమెంట్ వీధివైపు కదలవలసి వచ్చింది. భావి పౌరుల మీద పోలీసులు నీటి ఫిరంగులు, భాష్ప వాయు గోళాలు, పెల్లెట్‌గన్స్ ప్రయోగిం చారు. పోలీసులే రాళ్లు విసురుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అమ్మా యిల దుస్తులు చింపటం, నడిరోడ్డు మీద అవమానించడం ప్రపంచ మంతా చూసింది.
వాస్తవాలు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్న యూ ట్యూబర్లను కూడా వదలలేదు. తన చూపుడు వేలు చూపిస్తూ… “ఈ వేలుతో బీజేపీకి ఓటు వేసాను. ఈ వేలు విరగొ ట్టండ”ని పోలీసులతో వాదించిన యువకుని స్పందన స్ఫూర్తిదాయకం. పోలీసులు తమ నేమ్‌ప్లేట్లు తొలగించడం, పోలీసులతోపాటు, సంఘ పరివారం పంపిన గూండాలు కూడా చేరి యువతపై దాడి చేయడం ఆందోళనకరం. ఏ క్షణంలోనైనా కాల్పులకు సిద్ధంగా పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి ఉండడం ప్రజలు గమనించారు. యువత సంయమనమే పరిస్థితిని అదుపులో ఉంచింది. ఇంతటి భయానక పరిస్థితులను ప్రశ్నించవలసిన మీడియా, అందుకు భిన్నంగా అధికార పార్టీ బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్నది. ప్రపంచం ముందు భారత పార్లమెంట్‌ను అప్రతిష్టపాలు చేసేందుకే యువత పార్లమెంట్ వైపు కదిలిందని నిందలు వేసింది. మోడీ మోజులో పడిన మీడియాలో ఒక భాగానికి గతంలో బీజేపీ కూడా చలో పార్లమెంట్‌కు, చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సందర్భాలున్నాయన్న సోయి లేదు. పోరుబాటలో ఉన్న యువతకు మద్దతుగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింప జేయడాన్ని కూడా తప్పుబట్టింది. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో బీజేపీ నాయకులే నెల రోజుల పాటు పార్లమెంట్‌ను స్తంభింపజేసారమోడీ మోజులో పడిన మీడియాలో ఒక భాగానికి గతంలో బీజేపీ కూడా చలో పార్లమెంట్‌కు, చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సందర్భాలు న్నాయన్న సోయి లేదు. పోరుబాటలో ఉన్న యువతకు మద్దతుగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేయడాన్ని కూడా తప్పుబట్టింది.
మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో బీజేపీ నాయకులే నెల రోజుల పాటు పార్లమెంట్‌ను స్తంభింపజేసారన్న విషయం మరచినట్న విషయం మరచినట్టున్నది. నిరసనల్లోనూ యువతకు పార్టీలు మద్దతునివ్వడ మేమిటనీ, ఇతరులు ప్రదర్శనల్లో పాల్గొనడమేమిటని ప్రశ్నిస్తూ ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శించింది. బాధితులను ఒంటరి చేసి అణచివేయాలన్న పాలకులకు అండగా నిలిచింది. నోరుమెదపలేక ముఖం చాటేసిన మంత్రులు, బీజేపీ నేతల తరపున వీరే యువతపై విరుచుకుపడ్డారు. “లీకేజీ ఇప్పుడే జరిగిందా? గతంలో రాజీనామాలు చేసారా? మంత్రి రాజీనామా చేస్తే, ఇక ప్రతిదానికీ రాజీనామా డిమాండ్ చేస్తార”ని వితండవాదం చేసారు. ఇంతటితో ఆగలేదు. జూలై 20వ తేదీ తెల్లవారేటప్పటికీ జంతర్‌మంతర్ పరిసరాల్లో అద్దాలు పగిలిన రెండు కార్లు, రాళ్లతో నిండిన ఒక లారీ ప్రత్యక్షమయ్యాయి. పూర్తిగా పోలీసుల స్వాధీనంలో ఉన్న ఆ ప్రాంతానికి రాత్రికి రాత్రే పోలీసులకు తెలియకుండానే అవి అక్కడకు చేరాయా? ఇక ఆందోళన కారుల్లో సంఘవ్యతిరేక శక్తులు, పాత నేరస్తులు చేరారనీ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా వంటి విదేశీ శక్తులున్నాయని దేశ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. పార్లమెంట్‌ను కూల్చుతామంటున్నారని, ఔరంగజేబును కీర్తిస్తున్నారని, హిందూ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారని ప్రజలను ఉద్యమకారుల మీదికి ఎగదోసే ప్రయత్నం చేసారు. అయినా దేశ ప్రజలు చైతన్యం ప్రదర్శించారు. ఉద్యమబాటలో నడుస్తున్న యువతను ఆశీర్వదించారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన వారసత్వమే వీరిని వెస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా కూడా నిలుపుతున్నదేమో! నిజంగానే ఇది మరో స్వతంత్రపోరాట స్ఫూర్తి.
ప్రశ్నించేగొంతుకగా, ప్రజాస్వామ్య మూలస్తంభంగా ఉండవలసిన మీడియాలో కూడా అపసవ్య ధోరణులను గమనించాలి. అడ్వర్టైజ్‌మెంట్ల ఆదాయం కోసమో, బ్లాక్ మెయిల్ బెదిరింపులకు భయపడో లేక కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఫలితమో! ప్రజల మీడియా కూడా పుట్టుకొచ్చింది సుమా! మంత్రి రాజీనామా తర్వాత కూడా సంఘ్‌పరివారం సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టి మరలించే ప్రయత్నం కొనసాగిస్తున్నది. దేశవ్యాపిత అల్లర్లకు కుట్ర జరిగిందట! పోరుబాటలో ఉన్న యువతకు సంఘీభావం తెలిపినవారిలో వీరికి ముస్లింలు మాత్రమే కనిపించారు. పోరాడిన లక్షలాది యువత ఏ మతానికి చెందినవారో వీరు చెప్పరు. యువత ఉద్యమించిన తీరే ఒక ప్రత్యేకత. దానికి సంఘీభావం అందిన తీరు స్ఫూర్తిదాయకం. వేలాదిమంది ప్రజాస్వామ్యవాదులు ఉద్యమంలో ఉన్న యువతకు స్విగ్గీ, జొమాటో వంటి సాధనాల ద్వారా తిండి, మంచినీరు పంపటం అభినందనీయం. బీజేపీ, ఆరెస్సెస్ తదితర సంస్థలు మత చిచ్చుపెట్టేం దుకు ఎంత ప్రయత్నించినా, ఐక్య ఉద్యమానికి మతాతీత సంఘీభావం అందటంతో పాలకులు తట్టుకోలేక పోయారు. యువత ఉద్యమం ఆరంభం నుంచే సీపీఐ(ఎం), ఆప్ అగ్రనేతలు అండగా నిలిచారు. క్రమంగా ప్రతిపక్షాలన్నీ మద్దతుగా రంగంలోకి దిగాయి. సుమారు మూడు నెలలకు అర్ధరాత్రి జనం నిద్రలోకి జారిన తర్వాతగానీ ప్రధాని నోరువిప్పలేదు. మంత్రి రాజీనామా తప్పలేదు. ఇంత జరిగినా హాస్ప టల్స్‌లో ఉన్న యువతను సీపీఐ(ఎం) నాయ కులు పరామర్శిం చేందుకు కూడా పాలకులు అనుమతించటం లేదు.
రాజీనామా సందర్భంలో కూడా మంత్రి వంకర మాటలే మాట్లాడారు. ‘అరాచకం నివారించేందుకే రాజీనామా చేసా’నని అన్నారు. ఉద్యమానికిది ముగింపుకాదు. దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పోరాటం కొనసాగాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి. విద్యారంగం బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలే చూడాలి. విద్యారంగంలో వ్యాపార ధోరణులే పరీక్షాపత్రాల లీకేజీని ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడే కాంగ్రెస్ స్వభావం కూడా బయటపడుతున్నది. జాతీయస్థాయిలోనే పరీక్షా విధానం కొనసాగాలని బీజేపీతో పాటు, కాంగ్రెస్ కూడా చెపుతున్నది. ఈ వైఖరిని ఉద్యమకారులు ప్రశ్నించాలి. యువతలో ఈ కదలికకు కారణం న్యాయమూర్తి వ్యాఖ్యలేనని కొందరు భావిస్తున్నారు. ఇది నిజం కాదు. యువతలో అసంతృప్తి రగులుతున్న సమయంలో ఏదో ఒక కారణం ఇలాంటి పరిణామానికి దారితీస్తుంది. న్యాయమూర్తి వ్యాఖ్యకు ముందే ఉత్తర భారతదేశంలో లక్షలాది యువకార్మికులు పోరుబాటపట్టారు. వీరంతా ఆధునిక పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వలస కార్మికులు. గత డిసెంబర్‌లోనే నాచారంలో షాహీ ఎక్స్‌పోర్ట్స్ కార్మికులు కూడా ఆకస్మిక పోరాటంతో విజయం సాధించారు. జీడిమెట్ల హెచ్‌బీఎల్ కార్మికుల” కూడా తిరగబడ్డారు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను అణచివేయటం, మతంపేరుతో, విదేశీయుల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టటం ఎల్లవేళలా సాధ్యంకాదని నేటి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. పోరుబాటన నడిచే ప్రజలకు నాయ కత్వాన్ని అందించడమే ఎర్రజెండా బాధ్యత. కమ్యూనిస్టుల పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది సాధ్యం. అది ఆషామాషీగా రాదు. శ్రామికులతో మమేకం కావాలి.
ఎస్.వీరయ్య



