నకిలీ విత్తనాలు అమ్మిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి..

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గోండ డిమాండ్..
నవతెలంగాణ – జుక్కల్
నకిలీ విత్తనాలు లూజు విత్తనాలు అమ్మిన పురుగుమందుల వ్యాపారులు దళారుల పైన కఠినమైన చర్యలు అధికారులు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం అలాంటి వారి పైన క్రిమినల్ కేసులు పెట్టాలని, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గోండ  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ  సంధర్భంగా ప్రకటనలో  తెలియచేస్తు  జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రంలో గల పలు  ఎరపవుల దుకాణాలలో విత్తనాలను లూజు ప్యాకెట్లు వున్న  విత్తనాలు రైతులు కొనుగోలు చేయవద్దని సురేష్ గోండ రైతులకు విజ్ఞప్తి చేశారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు గుర్తింపు నెంబరు నమోదు చేసుకొని విత్తనాలు కొనుగోలు చేసే రైతులు ఒరిజినల్ బిల్లులు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా బిల్లు లేకుండా విత్తనాలు అమ్మినట్లు అయితే బిల్లుఇవ్వనని అంటే సంభందిత శాఖ అధికారులకు వ్రాతపూర్వకంగా రైతు  ఫిర్యాదు చేయాలని, వారి పైన కఠినమైన చర్యలు అధికారులు తీసుకోవాలని అన్నారు. నకిలి విత్తనాలు అమ్మెవారు గ్రామాలలో వాహనాలలో తిరిగుతున్నారని,  వారు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేని విత్తనాలు అమ్మెవారని, పక్కరాష్ట్రాలైన మహరాష్ట్ర, కర్ణాటక  చెందిన వారని గుర్తు ఉంచుకోవాలని, అన్ని అనుమతులు బిల్లు తీసుకొని  కొనుగోలు చేయాలని   ప్రత్యేకంగా వ్వవసాయ శాఖ ప్రత్యెక నిఘా పెట్టాలని తెలిపారు.
Spread the love