22 నుంచి శ్రీకారం.. జేఏసీ నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. గత మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ జేఏసీ తెలియజేసింది. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టినట్టు జేఏసీ చైర్మెన్ ఈదురు వెంకన్న, వైఎస్ చైర్మెన్ థామస్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా కార్మిక శాఖ ఉన్నతాధికారి ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వ కార్మిక శాఖ అధికారి సునితా గోపాల్ రాజ్ సంఘాల నాయకులతో హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌లో చర్చలు నిర్వహించారు. దీనికి ఆర్టీసీ అధికారులు ఎవరూ రాకపోవడం గమనార్హం. కాగా ఆర్టీసీ జేఏసీ అద్దె బస్సు యాజమాన్యాలను కలిశారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈనెల 24న ఉదయం డ్యూటీ నుంచి సమ్మె నిర్వహించనున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగాలని విజ్జప్తి చేశారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్ల్యక్షం వహిస్తు న్నట్టు తెలిపారు. దశలవారీగా ఆందోళన చేసినా సర్కారు పట్టంచు కోలేద న్నారు. నెలరోజులుగా అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయినా పట్టించుకోలేదన్నారు. రవాణా శాఖ మంత్రిని కలిసి సమస్యలు చెప్పినట్టు వివరించారు. ఈ సమ్మెలో ఆరు సంఘాలు మాత్రమే పాల్గొంటున్నాయి.
ఆర్టీసీలో సమ్మె సైరన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



