విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలి..

Quality food should be provided to the students.– భోజనాన్ని పరిశీలించిన ఎంఈఓ తరి రాము..
నవతెలంగాణ – పెద్దవూర
మధ్యాహ్న భోజన ఏజన్సీ వారు విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని మండల విద్యాధికారి తరి రాము ఆదేశించారు.గురువారం మండలం లోని వెల్మ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నూనె, చింతపండు, ఉప్పు వంటగది పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు పరిశుభ్రత మైన వాతావరణం లో భోజనం అందించాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున  ఉపాధ్యాయులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేకతగా పెట్టాలన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు విద్యార్థులకు వండి పెట్టే అన్నం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.ఏజన్సీ వారు వంట చేసేటప్పుడు తలకు కవర్లు ధరించాలని, అదేవిదంగా చేతులు ఏప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చీదెళ్ల శ్రీనివాస్,
సీనియర్ ఉపాధ్యాయులు, వసంత కుమార్, హిమవంత రెడ్డి, గుంటుక రామాంజి రెడ్డీ,వ్యాయమ పాధ్యాయులు లేనినిబాబు, అమ్మ ఆదర్శపాఠశాల ఛైర్మెన్ లక్ష్మి సురేందర్, పాల్గొన్నారు.
Spread the love