
హాస్టల్ విద్యార్థులు జూనియర్ సీనియర్ అని తేడాలేకుండా కలిసి మెలిసి ఉండాలని పీడీఎస్ యూజిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులను కోరారు. బోధన్ లో బీసీ హాస్టల్ ఘటన నేపథ్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలో ఉన్న హాస్టల్లో విద్యార్థులతో శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులు గొడవలకు దూరంగా ఉంటూ చదువుకోవాలని , ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత హాస్టల్ వార్డెన్ కు చెప్పాలని , ఇంటర్ విద్యార్థులు పరీక్షల్లో రాణించాలని, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ సంబంధించిన మెటీరియల్ పి.డి. ఎస్.యూ విద్యార్థి సంఘం తరపున పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలోపీడీఎస్ యూ నాయకులు రవీందర్, అక్షయ్ ,వరుణ్ , సాయి తదితరులు పాల్గొన్నారు.