విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి: ఏఎన్ఓ లెఫ్ట్నెంట్ గణేష్

నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రతి విద్యార్థి విద్యతోపాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని ఏఎన్ఓ లెఫ్ట్నెంట్ గణేష్ అన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్ 2023- 24 సంవత్సరంనకు చెందిన 30 మంది ఎన్సిసి విద్యార్థులకు  పరీక్షలను నిర్వహించడం జరిగింది.వీరిలో 30 మంది ఎన్సిసి కాడెట్స్ 100% ఉత్తీర్ణత సాధించినారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు బుధవారం ఎల్బీ కళాశాలలో  టెన్ టి బెటాలియన్ వరంగల్ వారి నుండి బి సర్టిఫికెట్ అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారు ఇప్పుడున్న పరిస్థితిలో సెల్ ఫోన్ లకు పరిమితం కాకుండా ఉండాలని ఇంటర్నెట్ ను విజ్ఞానాన్ని ఆస్వాదించి, చెడును విసర్జించాలని అన్నారు. ఎన్సిసి విద్యార్థులు శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఉల్లాసంగా ఆరోగ్య వంతులుగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని,ప్రతి విద్యార్థిని విద్యార్థులు  ఎన్సిసిలో చేరి దేశభక్తి పెంపొందించుకొని, పరిపాలన విధానంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు.ఎన్సిసి చేసి‘బీ’ సర్టిఫికెట్‌ పోందిన ప్రతి విద్యార్థి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో, పై చదువులలో ప్రత్యేక కోట ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  పాసైన విద్యార్థులకు స్థానిక ప్రిన్సిపాల్ ఆసనాల శ్రీనివాస్ ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్సిసి సర్జంట్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love