విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలి

Students should study well with disciplineనవతెలంగాణ – జన్నారం
విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని జన్నారం మండల తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో శశికళ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని  గిరిజన ఆశ్రమ బాలుర   పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు. అనంతరం వారు పడుకునే డార్మెంటరీలను పరిశీలించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు  హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిఓ జలంధర్ ఈవో రాహుల్, పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love