శ్రీ బండి సదానంద్ అండ్ మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికష్ణ సమర్పించు, తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘బుల్లెట్’. ఎవ్వడికైనా దిగుద్ది ట్యాగ్ లైన్‌తో దర్శకుడు చౌడప్ప రూపొందించారు. హీరో రవి వర్మ, సంజనా సింగ్ జంటగా నటించిన ఈ సినిమా మార్చి 8న విడుదలై 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్‌గా ఇంకా థియేటర్లో కొనసాగుతున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు. నిర్మాత గోపాల్ మాట్లాడుతూ, ‘సినిమా విజయం పై మేం పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు’ అని అన్నారు.