విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఏఎంబీ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా తరువాత.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి తరువాత అనేలా నా కెరీర్ ఉంటుంది. మే 17న థియేటర్లలో కలుద్దాం’ అని తెలిపారు. ‘విశ్వక్ నటించిన పక్కా మాస్ సినిమా. ఈ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది మొదటి షోకి తెలిసిపోతుంది. టిల్లు స్క్వేర్ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెప్పారు. దర్శకుడు కష్ణ చైతన్య మాట్లాడుతూ, ‘లంకల రత్న’గా విశ్వక్ విశ్వరూపం చూస్తారు’ అని అన్నారు.