నిర్మాత బెక్కం వేణు గోపాల్ పుట్టినరోజు వేడుకను ‘రోటీి కపడా రొమాన్స్’ చిత్ర బందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సజన కుమార్ బోజ్జం మాట్లాడుతూ,’ఈ సినిమాతో నిర్మాతగా నా జర్నీ మొదలుపెట్టాను. బెక్కం వేణు గోపాల్ నాకు చాలా సపోర్ట్ చేశారు’ అని తెలిపారు. ‘నేను నా లక్కీ మీడియా సంస్థని స్థాపించి 18 ఏండ్లు కావడం ఆనందంగా ఉంది. నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి ముఖ్య కారణం నా ఫ్యామిలీ, అలాగే నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లేకపోతే నేను ఈ రంగంలో ఉండేవాడినే కాదు. ఇప్పుడు వచ్చే ‘రోటి కాపడా రొమాన్స్’ కూడా మంచి హిట్ అవుతుంది. చాలా మంచి సినిమా తీసామనే సంతృప్తి ఉంది’
అని బెక్కం వేణు గోపాల్ చెప్పారు.