అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే శబరి

అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే శబరివరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌ పతాకంపై మహేంద్ర నాథ్‌ కూండ్ల నిర్మించారు. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్‌ కూండ్లహొమీడియాతోహొముచ్చటించారు. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. ఈ కథని తొలుత ఆమే విన్నారు. అలాగే ఆమె ముందు నుంచి మంచి క్యారెక్టర్లు సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. ఆవిడ ఓకే చేశారంటే 50 పర్సెంట్‌ నేను సేఫ్‌ అని ‘శబరి’కిహొఓకే చెప్పా. ఇందులో మదర్‌ అండ్‌ డాటర్‌ ఎమోషన్‌,హొసెంటి మెంట్‌. అది ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే పాయింట్‌. ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగా జనాల్లోకి వెళుతుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపననుహొతీసుకుని సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ప్లాన్‌ చేశాం. ఎమోషన్స్‌హొడిఫరెంట్‌ వేలోహొచెప్పాం.రిస్క్‌ అయినప్పటికీ ఐదు భాషల్లో చేద్దామంటే ఓకే చెప్పా. కన్నడ, మలయాళ, తమిళ డిస్ట్రి  బ్యూటర్లతోహొమాట్లాడటం నాకు కొత్త. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా బాగా చేస్తున్నా. అంతేకాదు అన్ని భాషల్లోనూ ఒకే రోజు నేనే ఓన్‌ రిలీజ్‌ చేస్తున్నా. ఇందులో ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టులు ఉన్నారు. గోపీసుందర్‌ మంచి మ్యూజిక్‌, రీ రికార్డింగ్‌ ఇచ్చారు. అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. కథలో భాగంగా యాక్షన్‌ సీక్వెన్సులుహొడిజైన్‌ చేశారు. ఎమోషనల్‌ డ్రామా కంటిన్యూ అవుతున్నహొతరుణంలో యాక్షన్‌ వస్తుంది వరలక్ష్మి ఎంతో కష్టపడి యాక్షన్‌ సీక్వెన్సులు చేశారు. ఆమె నిర్మాతలకు ఆవిడ చేసే మేలు చాలా మందికి తెలియదు. ‘మీకు మరో సినిమా చేస్తాను. మనం చేద్దాం’ అని నాతో చెప్పడం ఆనందంగా ఉంది. వరుణ్‌ సందేశ్‌ హీరోగా, నిర్మాతగా నా రెండో సినిమా ప్రొడక్షన్‌లో ఉంది. బిగ్‌ బాస్‌ అమర్‌ దీప్‌, సురేఖా వాణి కుమార్తె సుప్రీత జంటగా మూడో సినిమా చేస్తున్నా.

Spread the love