నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ప్రతినిధి 2’. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌పై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మూర్తి దేవగుప్తా చిత్ర విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ”ప్రతినిధి 1′ ఎజెండా వ్యవస్థని ప్రశ్నించడం.
అందులో ఏ పార్టీని టార్గెట్ చేయలేదు. ‘ప్రతినిధి 2’ ఎజెండా కూడా అదే. అయితే ‘ప్రతినిధి 1’లో సిస్టం బయట నుంచి ప్రశ్నిస్తాడు. ఇందులో సిస్టం లోపల ఉండి ప్రశ్నిస్తాడు. సినీ గోయర్స్, సినీ లవర్స్ ఇష్టపడే సినిమా ఇది. పక్కా కమర్షియల్ థ్రిల్లర్. ‘ఠాగూర్, లూసిఫర్, ఒకే ఒక్కడు, భారతీయుడు, లీడర్’ ఈ సినిమాలన్నీ ఏ పార్టీని టార్గెట్ చేసినవి కాదు. వ్యవస్థని ప్రశ్నించేవే. ‘ప్రతినిధి 2′ కూడా అంతే. ప్రతి జర్నలిస్ట్‌కి ప్రతిరూపంగా ఇందులో హీరో పాత్ర ఉంటుంది. కలం వీరులకు, యోధులకు ఒక ట్రిబ్యుట్‌లా ఉంటుంది. ఇందులో హీరో వ్యవస్థని ప్రశ్నించడం నుంచి మొదలు పెడితే దానిని క్లీన్ చేసే పరిస్థితి వరకూ వెళ్తాడు’ అని చెప్పారు.