ఓ ఆత్మ ప్రేమకథ

ఓ ఆత్మ ప్రేమకథఆశిష్‌, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్‌ మీ’. ఈ చిత్రానికి అరుణ్‌ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. ఈ హర్రర్‌ థిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ సినిమా మే 25న రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో బ్లాక్‌ బస్టర్‌ సాధిస్తామని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ‘ఇప్పటి వరకు ఎన్నో హర్రర్‌ ధ్రిల్లర్స్‌ వచ్చాయి. వాటితో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. దెయ్యాన్ని ప్రేమించాలని ఆరాటపడే ఓ యువకుడి కథే ఇది. ఓ పక్క భయపెడుతూనే మరో పక్క అందమైన ప్రేమకథని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల అంశాలూ ఉన్నాయి. ఇది కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా అని మేకర్స్‌ దీమా వ్యక్తం చేస్తున్నారు. ఆశిష్‌, వైష్ణవి చైతన్య పోషించిన పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. అలాగే ఈ కథలోని సోల్‌ అందర్నీ బాగా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. సినిమాటోగ్రాఫర్‌ పి.సి.శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, అవినాష్‌ కొల్ల ఆర్ట్‌ డైరెక్షన్‌, ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.

Spread the love