హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎక్స్’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. అనురూప్ కటారి హీరోగా నటిస్తున్నారు. దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించిన నరేష్ పెంట మాట్లాడుతూ,’ఈ సినిమాతో సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులు పొందుతారు. ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కొనసాగే ఈ చిత్రంలో ఉండే ప్రేమకథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొత్తం ఒక డిఫరెంట్ అండ్ విజువల్ ఫీస్ట్‌లా ఉండేలా ప్రదేశంలో చిత్రీకరణ జరుపుతున్నాం’ అని అన్నారు.