భిన్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌

భిన్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కళ్యాణ్‌, రవీంద్ర విజరు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆరంభం’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై అభిషేక్‌ వీటీ నిర్మిస్తున్నారు. అజరు నాగ్‌ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ను మంగళవారం మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.
ఈ సినిమాను మే 10న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అనౌన్స్‌ మెంట్‌ నుంచి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌తో పాటు హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్‌ చేసిన ‘అనగా అనగా..’ లిరికల్‌ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వైవిధ్యమైన కథా కథనాలతో ఓ డిఫరెంట్‌ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఈ చిత్ర విజయంపై మేకర్స్‌ ఎంతో నమ్మకంతో ఉన్నారు. లక్ష్మణ్‌ మీసాల, బోడెపల్లి అభిషేక్‌, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌ – ఆదిత్య తివారీ, ప్రీతమ్‌ గాయత్రి, సినిమాటోగ్రఫీ – దేవ్‌ దీప్‌ గాంధీ కుందు, మ్యూజిక్‌ – సింజిత్‌ యెర్రమిల్లి, డైలాగ్స్‌ – సందీప్‌ అంగిడి, సౌండ్‌ – మాణిక ప్రభు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – వినరు రెడ్డి మామిడి.

Spread the love