ఏకధాటిగా 26 రోజులు

ఏకధాటిగా 26 రోజులుచిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు రెడీ అవుతోంది. యూవీ క్రియేషన్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కష్ణన్‌ కథానాయికగా నటిస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర బృందం ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఏ.ఎస్‌.ప్రకాష్‌ నిర్మించిన 54 అడుగుల హనుమాన్‌ విగ్రహంతో ఉన్న హ్యుజ్‌ సెట్‌లో మ్యాసీవ్‌ స్టంట్‌ సీక్వెన్స్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిస్తోంది. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి, ఫైటర్స్‌ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ ఫైట్‌తో ఇంటర్వెల్‌ బ్లాక్‌ బ్యాంగ్‌-ఆన్‌ కానుంది. ఈ సీక్వెన్స్‌ ఇండియన్‌ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్‌ డేస్‌లో చిత్రీకరించారు. చిరంజీవి ఒక్క ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం ఇన్ని వర్కింగ్‌ డేస్‌ కేటాయించడం ఇదే అత్యధికం. ఈ సీక్వెన్స్‌ షూటింగ్‌ నేటి(మంగళవారం)తో పూర్తవుతుంది. ఈ హైవోల్టేజ్‌ యూనిక్‌ యాక్షన్‌ బ్లాక్‌ అభిమానులు, మాసెస్‌ను థియేటర్‌లలో మెస్మరైజ్‌ చేయనుంది. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Spread the love