పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం

– 2000-2001 బ్యాచ్‌ పూర్వపు విద్యార్థులు
నవతెలంగాణ-దోమ
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన 2000-2001లో పదవ తరగతి చదివిన విద్యార్థులు దోమ మండల కేంద్రంలోని ఎస్‌.జీ గార్డెన్స్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఆ బ్యాచ్‌కు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ దాదాపు 22 సంవత్సరాలు గడిచిన ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ తమను గుర్తుంచుకొని ప్రత్యేకంగా ఆహ్వాన పలికి సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు కొంత మంది ప్రభుత్వంలో కొంతమంది బిజినెస్‌ లో మరి కొంతమంది వివిధ రంగాల్లో స్థిరపడడం చాలా గర్వంగా ఉందని వారన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తాము ఇంత ఎదుగుతున్న దానికి మూల కారణం చదువు చెప్పిన ఉపాధ్యాయులేనని, వారు నేర్పిన క్రమశిక్షణ వల్లనే వివిధ స్థానాల్లో స్థిరపడడం జరిగిందని, వారు చదివిన సమయంలో గడిచిన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకొని కార్యక్రమం విజయవంతం చేశారు. కార్యక్రమానికి సహకరించిన దోమ మాజీ సర్పంచ్‌ రాజిరెడ్డినీ పూర్వపు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌, ప్రమోద్‌రెడ్డి, గోవింద్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, గీత, భ్రమరాంబ, హుస్సేన్‌, శివశంకర్‌, పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love