– కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే…
– అవకాశం ఇవ్వండి అభివద్ధి చేస్తా
– మాజీ ఎంపీ, బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-కోట్‌పల్లి
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వ మే అధికారంలోకి వస్తుందని చేవెళ్ల మాజీ ఎంపీ బీజేపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా కోట్‌పల్లి మండల పరిధిలోని అన్నసాగర్, రాంపూర్, మోత్కుపల్లి, బార్వాద్, ఎన్నారం, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదయాత్రలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి లబ్ది చేకూరాలంటే మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత బీజేపీదేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఉచిత రేషన్ బియ్యం, ఉజ్వల గ్యాస్, కరోనా టైంలో వ్యాక్సిన్, సీసీ రోడ్లు డంపింగ్ యార్డులు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత బీజేపిదేనని గుర్తు చేశారు. చేవెళ్ల పార్లమెంటు నుంచి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి అభివద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కొన్ని గ్రామాలలో వివిధ పార్టీల నుంచి బీజేపీ పార్టీలో చేరడంతో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు యాష్కీ శిరీష, బీజేవైఎం అధ్యక్షుడు చిట్యాల సాయిచరణ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కృష్ణ, తాండూర్ సీనియర్ నాయకులు రమేష్ కుమార్, బంటారం భద్రేశ్వర్, మండల అధ్యక్షుడు కష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి చాకలి జగదీశ్వర్, సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, శివకుమార్, నరసింహారెడ్డి, మహేందర్ దొర, తదితరులు పాల్గొన్నారు.