సూక్ష్మ చిత్ర కళాకారుడికి ప్రపంచ స్థాయి గుర్తింపు

– తెలంగాణ బుక్‌ అఫ్‌ వరల్డ్‌ రికార్డులో అశోక్‌కి చోటు
నవతెలంగాణ-కోడంగల్‌
వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండల పరిధిలో యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్‌. సున్నపు అశోక్‌ తను చిత్రకళ సూక్ష్మ చిత్రకళలో మంచి నేర్పరి తన కళా నైపుణ్యనికి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇతడు చిరు ప్రాయంలోనే చిత్రకళాపట్ల ఆకర్షితుడైయ్యారు. ఇతడు గీసిన చిత్రాలలో దేశభక్తి దైవభక్తి ఉట్టిపడుతుంది. ఇప్పటికే తన కుంచె నుండి అనేక చిత్రాలు జాలు వరాయి ఖాళీ సమయంలో విభిన్నమైన సూక్ష్మ చిత్రకళపై పట్టు సాధించారు. అక్కరకు రాని వస్తువులతో ఆకట్టుకునే కళాఖండాలు తయారు చేస్తూ సందర్భాన్ని బట్టి సందేశాత్మక కళాఖండాలను తయారు చేస్తూ తన ప్రతిభను చాటుతున్నారు. ఎందరో ప్రముఖుల నుండి కళాభిమన్నలు పొందుతున్నారు. తన హస్త కళతో తయారు చేసిన కళాకతులకు గాను తెలంగాణ బుక్‌ అఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లో స్థానం లభించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన తెలంగాణ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ హైదరాబాద్‌ వారు వివిధ సామాజిక రంగాలలో ప్రతిభను కనిపరిస్తున్న వ్యక్తులను గుర్తించి రికార్డులతో పట్టం కడతారు. ఈ నేపథ్యంలో అశోక్‌ కళా సేవను గుర్తించి తెలంగాణ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌ లైన్‌ వేదికలో అందించారు. ఈ అరుదైన గౌరవం దక్కినందుకు కళాకారుడు అశోక్‌ కు చాలా సంతోషంగా ఉందని నా కళ్ళను గుర్తించి దాతలు ఎవరైనా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో మరిన్ని వరల్డ్‌ రికార్డులను సాధించి మా ఊరికి ఈ ప్రాంతానికి నా కళా పట్ల మంచి పేరు తీసుకు వస్తాను అని అశోక్‌ తెలిపారు. ఈ యువకుడు గతంలో పలు అవార్డులు రికార్డులు కూడా నెలకొల్పరు, అశోక్‌ కి ఈ ఘనత దక్కినందుకు తన తల్లి దండ్రులు. బంధువులు. స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Spread the love