టైటిల్‌ నిలుపుకుంటారా?

టైటిల్‌ నిలుపుకుంటారా?– నేటి నుంచి థామస్‌ కప్‌ పోరు
– ఉబెర్‌ కప్‌ బరిలో యువ షట్లర్లు
చెంగ్డూ (చైనా) : రెండేండ్ల క్రితం పసిడి ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మెన్స్‌ బ్యాడ్మింటన్‌ జట్టు.. చెంగ్డూ వేదికగా టైటిల్‌ నిలుపుకునేందుకు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. ఇటీవల కాలంలో భారత మెన్స్‌ షట్లర్లు నిలకడ లేమి ప్రదర్శనతో కంగారూ పెడుతున్నా.. థామస్‌ కప్‌లో మళ్లీ మెడల్‌ కొట్టేందుకు సై అంటున్నారు. యువ స్టార్స్‌ లక్ష్యసేన్‌, ప్రియాన్షు రజావత్‌, కిరణ్‌ జార్జ్‌లు సింగిల్స్‌ బరిలో ఉన్నారు. సీనియర్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణరులు రొటేషన్‌లో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విశ్రాంతి తీసుకున్న డబుల్స్‌ అగ్ర జోడీ సాత్విక్‌, చిరాగ్‌లు ప్రతిష్టాత్మక టోర్నీ బరిలోకి దిగుతున్నారు. అర్జన్‌, కపిల జోడీ సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇండోనేషియా, థారులాండ్‌, ఇంగ్లాండ్‌తో కలిసి గూప్‌-సిలో ఉన్న టీమ్‌ ఇండియా ప్రతి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇక, పి.వి సింధు దూరమైన వేళ యువ షట్లర్లతో భారత్‌ ఉబెర్‌ కప్‌లో బరిలోకి దిగుతోంది. చైనా, సింగపూర్‌, కెనడాలతో కూడిన గ్రూప్‌-ఏలో నాకౌట్‌ దశకు చేరటం భారత అమ్మాయిలకు కఠిన సవాల్‌గా మారింది. అష్మిత చాలిహ, అన్మోల్‌ కార్బ్‌లు ఉబెర్‌ కప్‌లో భారత్‌ను ముందుండి నడిపించనున్నారు.

Spread the love