తెలుగు చిత్ర పరిశ్రమ సమక్షంలో అత్యంత వైభవంగా డైరెక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌

In the presence of Telugu film industry Director's Day celebrations in grand styleదర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4వ తేదీని డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ ఘనంగా నిర్వహించ బోతున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. మే 4న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ను గ్రాండ్‌ గా జరపనున్నారు.
ఈ ఈవెంట్‌ వివరాలను సోమవారం సాయంత్రం నిర్వహించిన కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ వెబ్‌ సైట్‌, డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ లోగోను ఆవిష్కరించారు.
‘డైరెక్టర్స్‌ డేను ఇప్పటిదాకా మామూలుగా నిర్వహిస్తూ వచ్చాం. కానీ ఈసారి డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కు కొత్త కమిటీ వచ్చాక చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్‌ చేశాం. మన స్టార్స్‌, దర్శకుల సంఘం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ ఈవెంట్‌ చేస్తున్నాం’ అని తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సాయి రాజేశ్‌ తెలిపారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, ‘ఈ అసోసియేషన్‌లో గతంలోకి ఇప్పటికీ తేడా కనిపిస్తోంది. నాలుగు గోడల మధ్యలో మనం ఇన్నాళ్లూ డైరెక్టర్స్‌ డే జరుపుకున్నాం. ఇప్పుడు ఘనంగా చేసుకోబోతున్నాం. ఈ వేడుకలతో మన దర్శకుల సంఘం గొప్పదనాన్ని దేశమంతా చాటి చెప్పాలి’ అని తెలిపారు.
‘డైరెక్టర్స్‌ డే నిర్వహణ అనేది మన అసోసియేషన్‌ తరపున ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి దర్శకుల సంఘం సత్తా చాటేలా డైరెక్టర్స్‌ డే వేడుకలు ఉండబోతున్నాయి. 24 విభాగాల నుంచి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం’ అని దర్శకుడు రాంప్రసాద్‌ చెప్పారు.
మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే ఉన్నట్లే డైరెక్టర్స్‌ డే కూడా అంతే పేరు తెచ్చుకోవాలి. తెలుగు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కు మొత్తం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో మంచి పేరుంది. ఇప్పటిదాకా మనం డైరెక్టర్స్‌ డేను ఇండోర్‌లో చిన్నగా చేసుకున్నాం. ఈసారి ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించు కోబోతున్నాం. హరీశ్‌ శంకర్‌, మారుతి, అనిల్‌ రావిపూడి వంటి దర్శకులు బిజీగా ఉన్నా మన అసోసియేషన్‌ కార్యక్రమంలో యాక్టీవ్‌గా పార్టిసిపేట్‌ చేస్తున్నారు. అసోసియేషన్‌ మన కుటుంబం అని ప్రతి ఒక్కరూ భావించడం వల్లే ఈ ఈవెంట్‌ కోసం అందరం కష్టపడుతున్నాం. డైరెక్టర్స్‌ డే వేడుకల్లో చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా.
– తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీరశంకర్‌
రూ.35 లక్షల విరాళం
చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో భాగమవుతుంటారు ప్రభాస్‌. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు. మే 4న హైదరాబాద్‌ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కు ప్రభాస్‌ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. దర్శకుల సంఘం సంక్షేమ నిధి కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. టిఎఫ్‌డిఎ నిర్వహించిన డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి ఈ విషయాన్ని సంఘ సభ్యులకు తెలియజేశారు. రూ.35 లక్షల భారీ రూపాయల విరాళం అందించిన ప్రభాస్‌కు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కతజ్ఞతలు తెలిపారు.

Spread the love