సీతా కళ్యాణ వైభోగమే హిట్‌ ఖాయం

సీతా కళ్యాణ వైభోగమే హిట్‌ ఖాయంసుమన్‌ తేజ్‌, గరీమ చౌహాన్‌ హీరో, హీరోయిన్లుగా డ్రీమ్‌ గేట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సతీష్‌ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్‌ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఈనెల 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం నిర్వహించిన ప్రీ-రిలీజ్‌కు యాటా సత్యనారాయణ, విజరు కనకమేడల, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌ రెడ్డి, నటుడు రమణారెడ్డి, నీరూస్‌ ప్రతినిధి హసీం తదితరులు అతిథులుగా విచ్చేసి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
సుమన్‌ తేజ్‌ మాట్లాడుతూ, ‘మా లాంటి కొత్త వాళ్లను ఎంకరేజ్‌ చేస్తున్న మా నిర్మాత యుగంధర్‌కి థ్యాంక్స్‌. మా దర్శకుడు సతీష్‌ మంచి పాత్ర ఇచ్చారు. నీరూస్‌ ఇచ్చిన సపోర్ట్‌ వల్లే ఈ రోజు ఇక్కడి వరకు సినిమా వచ్చింది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.
‘సీతలాంటి పాత్ర నా కెరీర్‌ ప్రారంభంలోనే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మీద ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’ అని గరిమ చౌహాన్‌ చెప్పారు.
నిర్మాత రాచాల యుగంధర్‌ మాట్లాడుతూ, ‘ఏ మాత్రం రెమ్యూనరేషన్‌ ఆశించకుండా పని చేసిన చరణ్‌ అర్జున్‌కు థ్యాంక్స్‌. డైరెక్టర్‌ సతీష్‌ సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. సుమన్‌, గరిమ, గగన్‌ విహారి అందరూ అద్భుతంగా నటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రవన్న వల్లే ఈ సినిమా ముందుకు సాగింది’ అని తెలిపారు. గగన్‌ విహారి మాట్లాడుతూ,’సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ చిత్రంలో నాలాంటి రావణ పాత్రతో సీత ఎలాంటి కష్టాలు పడిందో చూపించారు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర’ అని తెలిపారు.
ఎలా బతకాలో రామాయణం చెబుతుంది. రాముడు మామూలు మనిషి. కానీ దేవుడు అయ్యాడు. సీత ప్రేమ కోసం యుద్దం చేయడం, రావణ సంహారం తరువాత దేవుడయ్యాడు.. ఈ ప్రేమ కథను తీయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాను. ఆడపిల్ల పుడితే అదష్టమని అంతా అనుకుంటాం. కానీ ఆడపిల్లకు సరైన కేరాఫ్‌ అడ్రస్‌ ఉండదు. మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఎమోషనల్‌ జర్నీగా చూపించాను. సందేశాత్మక చిత్రమని ప్రేక్షకులను బోర్‌ కొట్టించం. ప్రస్తుత తరానికి నచ్చేలా ఈ సినిమాను తీశాను. ఆడపిల్ల ఉన్న ప్రతీ కుటుంబానికి ఈ సినిమా నచ్చుతుంది. సమ్మర్‌లో మా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. ‘ఊరికి ఉత్తరాన’ సినిమాను రాచాల యుగంధర్‌ విడుదల చేశారు. ఈ మూవీ కథ పూర్తిగా వినకుండా నమ్మకంతో ఈ ఆఫర్‌ ఇచ్చారు. గరిమ ఈ పాత్రకు వంద శాతం సరిపోయింది. సుమన్‌ తేజ్‌ అద్భుతంగా నటించాడు.
– దర్శకుడు సతీష్‌ పరమవేద

Spread the love