ఫ్యామిలీస్‌కి వేసవి కానుకగా ఇస్తున్న చిత్రం

ఫ్యామిలీస్‌కి వేసవి కానుకగా ఇస్తున్న చిత్రంహీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్‌ రాజు, డైరెక్టర్‌ పరశురామ్‌ పెట్ల కాంబినేషన్‌లో రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్‌, విజయ్ ఫ్యాన్స్‌ హాజరయ్యారు. ఈనెల 5న వరల్డ్‌ వైడ్‌గా థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మూవీ టీమ్‌ వ్యక్తం చేసింది.దర్శకుడు పరశురామ్‌ పెట్ల మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ సినిమాను ఇష్టపడతారు. ఈ కథలోని ఎమోషన్స్‌కు కనెక్ట్‌ అవుతారు. నేను, విజయ్ గీత గోవిందం సినిమా చేశాం. మళ్లీ మేము కలిసి సినిమా చేస్తున్నామంటే అది గుర్తుండిపోయే మూవీ కావాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేసేందుకే ప్రయత్నించాను. విజయ్ ఈ కథ విన్నప్పుడు పడిన ఎగ్జైట్‌మెంట్‌, ఇందులో తను చేసిన గోవర్థన్‌ క్యారెక్టర్‌ కోసం ప్రిపేర్‌ అయిన విధానం రేపు స్క్రీన్‌ మీద చూస్తారు. ఇందు క్యారెక్టర్‌ను మణాల్‌ అద్భుతంగా పోషించింది’ అని తెలిపారు. ‘మన ఫ్యామిలీస్‌లోని ఎమోషన్స్‌ అన్నీ కలిపి తయారు చేసిన సినిమా ఇది. ఈ సినిమా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో విజరు క్యారెక్టర్‌ హైలైట్‌ అవుతుంది. అతను నవ్విస్తాడు, ఫైట్స్‌ చేస్తాడు, కోపం వస్తే కొట్టమని హీరోయిన్‌తో దెబ్బలు తింటాడు. ఫ్యామిలీ స్టార్‌ చూశాక అమ్మాయిలకైతే విజయ్ క్యారెక్టర్‌ చాలా నచ్చుతుంది. మణాల్‌ లక్కీ హీరోయిన్‌. సీతా రామం, హారు నాన్న తర్వాత ఫ్యామిలీ స్టార్‌తో హ్యాట్రిక్‌ అందుకోబోతోంది’ అని నిర్మాత దిల్‌ రాజు చెప్పారు. హీరోయిన్‌ మణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, ‘ఇవాళ ఎంతో ప్రత్యేకమైన రోజు. చాలా హ్యాపీ ఫీలింగ్‌ కలుగుతోంది. నన్ను మీరంతా తెలుగు అమ్మాయిగా యాక్సెప్ట్‌ చేశారు. మీ ఆదరణ, ప్రేమకు ధన్యవాదాలు’ అని చెప్పారు.
ఆరేళ్ల కిందట నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘గీత గోవిందం’ ఇదే డైరెక్టర్‌తో చేశాను. పరశురామ్‌ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. ఆయన మా ఫ్యామిలీ స్టార్‌. ప్రతి ఫ్యామిలీలో స్టార్‌ ఉంటాడు. ఆ స్టార్‌ ఫ్యామిలీ స్టార్‌. ఫ్యామిలీ స్టార్‌ లాంటి సినిమా నాకు దక్కడం అదృష్టం.
– విజయ్ దేవరకొండ

Spread the love