తాగుడుకు బానిసై యువకుడి ఆత్మహత్య

నవతెలంగాణ- రామారెడ్డి: తాగుడుకు బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన బట్టు రాజశేఖర్ (26) ఆదివారం రాత్రి తాగడానికి తల్లిని డబ్బులు అడగగా, డబ్బులు లేవు, రేపు ఉదయం ఇస్తానని చెప్పటంతో, గొడవ చేసి క్షణికావేశంలో గ్రామ శివారులోని పటేల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి బట్టు లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Spread the love