ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్‌బీర్‌, జ్ఞానేశ్‌


నవతెలంగాణ న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్లు (Election Commissioners)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ (Dr Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్‌ కుమార్‌ (Gyanesh Kumar) నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా వీరు ఈసీఐలో చేరారు. కమిషనర్లుగా శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్‌ కుమార్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్నారు. కమిషనర్‌గా ఉన్న అనూప్‌ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్యమైంది.
కాగా, ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ , ఎన్నికల కమిషనర్‌ల నియామక కమిటీ నుంచి సీజేఐని తప్పించి ఆ స్థా నంలో క్యాబినెట్‌ మంత్రిని చేర్చటాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

Spread the love