నవతెలంగాణ-ఆలేరు రూరల్
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా సమ్మర్ క్యాంపులు ఉపయోగపడతాయని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ ఎర్ర లక్ష్మి సూచించారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునే దిశగా శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కోరారు.అనంతరం పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ మాట్లాడుతూ ఆలేరు మండలంలోని కొలనుపాక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.విద్యార్థుల్లో పఠనాసక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో ఈ క్యాంప్‌ను రూపొందించినట్లు తెలిపారు.ఇంగ్లీష్ గేమ్స్ అండ్ స్పీచ్, డ్రాయింగ్, మ్యాథ్స్, డాన్స్, యోగా తదితర అంశాలపై నిపుణులతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యవతి, సుకన్య, నాగేశ్వరరావు,విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా సమ్మర్ క్యాంప్: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



